Film Nagar News
Saturday, 2 July 2011
బుడ్డా హోగయా తేరా బాప్ రివ్యూ
కథ మొత్తం విన్న తర్వాత కొన్ని సందేహాలున్నాయని అమిత్జీ అన్నప్పుడు ‘తనని నమ్మండి. బ్లాక్ బస్టర్ ఇస్తాడు’ అని ఆర్జీవీ(రామ్‌గోపాల్‌వర్మ) నమ్మకంగా చెప్పారు.ఆర్జీవీ మీద నమ్మకంతో మరో మాట మాట్లాడకుండా అమిత్జీ బుడ్డా హోగయా తేరా బాప్ చిత్రంలో నటించారు అంటూ పూరి జగన్నాధ్ తన చిత్రం ఎలా ఓకే అయ్యిందో ఎమోషనల్ గా చెప్పారు.
ముంబైకి చెందిన పాత గ్యాంగ్‌స్టర్ విజు(అమితాబ్). పోలీసు కేసుల్లో ఇరుక్కుని పారిపోయి ప్యారిస్ లో పబ్ నడుపుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ఈలోగా ఈ షార్ప్ షూటర్ కి గన్ కి పనిపట్టే ఎస్సైన్ మెంట్ వస్తుంది. ముంబైలోని మాపియా లార్డ్ (ప్రకాష్ రాజ్)తమను ఏరిపారేయటానికి కంకణం కట్టుకున్న ఎసిపి కరన్ (సోనూసూద్) ని చంపేయమని సుపారి ఇస్తాడు. అయితే ట్విస్టు ఏంటంటే కరన్ మరెవరో కాదు విజు కొడుకే.కానీ ఆ విషయం కరన్ కి తెలియదు.తన కొడుకుని మాఫియా నుంచి కాపాడుకోవటానికి నడుం బిగించి ఈ ముసలి రిటైర్ట్డ్ గ్యాంగస్టర్ ఏం చేసాడు అన్నది ఫన్నీగా,సెంటిమెంట్ తో నడిచే కధనం.
అమితాబ్ అభిమాలందరినీ ఆనందంలో ముంచేసాలా కథ...కాదు..కాదు కథనం తయారు చేసుకుని సౌతిండియా ట్విస్ట్ తో బాలీవుడ్ కి హిట్ ట్విస్ట్ ఇచ్చేసాడు.డబ్పైలు,ఎనభైల్లో అమితాబ్ సినిమాలు చూసి అభిమానులైన వారికి మరోసారి ఆ రోజులను గుర్తు చేసి ధియోటర్స్ ని నింపే ప్రయత్నం చేసాడు.
Rating 3.5/5.
అమితాబ్ లోని అధ్బుతమైన నటుడుని ఎలివేట్ చేసే చిత్రం అని చెప్పము కానీ అంతకుమించిన ఇమేజ్ ని మరోసారి హైలెట్ చేసిన చిత్రం అని చెప్పవచ్చు. ఇక అమితాబ్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. అలాగే అమితాబ్ బార్యగా చేసిన హేమమాలిని, గర్లెప్రెండ్ గా చేసిన రవినాటాండన్ కూడా అమితాబ్ తో పోటీ పడ్డారు.అందరి కన్నా ఛార్మి తన మరిచినపోయిన నటనను వెలికితీసే ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకుంది. పాటలు ఇప్పటికే ప్రజాదారణ పొందాయి. ఎడిటింగ్ రెగ్యులర్ పూరీ సినిమాల్లో లాగానై చాలా క్రిస్ప్ గా ఉంది. అంతేగాక తెలుగులోనే కాక హిందీలోనూ పూరీ డైలాగులు స్పెషల్ గా కనిపించటం విశేషం. కెమరా కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫైనల్ గా దర్శకుడుగా పూరి జగన్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా సక్సెస్ ఫుల్ గా జరిగినట్లే. అలాగే తెలుగు నటులుకు,సాంకేతిక నిపుణులకు కూడా పూరీ ద్వారా బాలీవుడ్ కి బస్ వేసినట్లే.
ఇక అమితాబ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రత్యేకం కాబట్టి చూడక తప్పదు.అలాగే తెలుగులో పూరీ అభిమానులు కూడా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన సందర్భంగా ధియోటర్స్ కి ఆనందంగా వెళ్ళవచ్చు. అయితే అదేంటి హింది సినిమాకి వెళ్థే తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ కలిగిందే అనుకుంటే మాత్రం ఏం చెయ్యలేం. అలాగే పూరీని చూసి ఇంకాఎంతమంది తెలుగు దర్శకులు బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకుంటారో చూడాలి
నేను బీపీ షుగర్‌తో చావను. బుల్లెట్‌తోనే చస్తా
సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో తీయాలి అని అమితాబ్ ముందే చెప్పారు. అంతే కాదు... మొదటి రోజే డబ్బులు తిరిగి రావాలి అనే షరతు కూడా విధించారు. అనుకొన్నట్టుగానే విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో లాభాలొచ్చాయి. నా దృష్టిలో కథ, కథనం, పాత్రల స్వభావం... ఇవే ముఖ్యం. ఎంత ఖర్చుపెట్టాం అనేది కాదు. మనమే హంగామాకుపోయి ఎక్కువ ఖర్చుపెట్టేస్తున్నాం. భారీదనం అనేది ఖర్చులో ఉండదు. 'పోకిరి'ని కూడా నేను కేవలం పది కోట్లలోనే తీశాను అన్నారు దర్శకులు పూరీ జగన్నాధ్. అమితాబ్ తో తీసిన బుడ్డా చిత్రం హిట్టయిన సందర్బంగా ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. అలాగే బుడ్డా చిత్రం కథ ఎలా తయారైందో చెప్తూ...ముందు 'నేను బీపీ షుగర్‌తో చావను. బుల్లెట్‌తోనే చస్తా..' అనే డైలాగు రాసుకొన్నా. దాన్ని ఆధారంగా మిగతా కథ రాశాను. వారం రోజుల్లో 'బుడ్డా' కథ సిద్ధమైపోయింది అన్నారు.
జూ ఎన్టీఆర్ నెంబర్ వన్ డాన్సర్
జూ ఎన్టీఆర్ ఇన్నాళ్లూ తనే నెంబర్ వన్ డాన్సర్ అనిపించుకున్నాడు.దాంతో ఇప్పుడు ఆ స్ధానం వేరే వారికి వెళ్ళేటట్లు ఉందని తన కొరియోగ్రాఫర్స్ ని ఓ రేంజిలో టార్చర్ పెడుతున్నట్లు సమాచారం. కొత్త స్టెప్స్, వెరైటీగా ఉండేవి కావాలని,వారు ఏ స్టెప్ వేసినా ఇంకా బాగా ఉండాలని ఆదేశిస్తునున్నట్లు సమాచారం. దాంతో వారు తమలో క్రియోటివిటి అనేది కిల్ అయిపోతోందని గోల పెడుతున్నారుట. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్..దీనికి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్...సురేంద్ర రెడ్డి,బోయపాటి శ్రీను ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.
అతనితో చేయనని తెగేసి చెప్పిన జూ ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో ఎప్పటినుంచో సినిమా ప్రపోజల్స్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే అవి ఇప్పటివరకూ మెటీరియలైజ్ కాలేదు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ని ఎప్రోచ్ అయిన కల్యాణ్ రామ్..తమ ఇద్దరి కాంబినేషన్ లో మల్టి స్టారర్ సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడట.
అయితే ఎన్టీఆర్ మాత్రం తను ఇప్పుడు మల్టి స్టారర్ చిత్రాలు చేసే ఆలోచన లేదని, సోలో హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేసుకుంటే డేట్స్ కేటాయించగలనని చెప్పాడట. దాంతో తనే హీరోగా సినిమా చేయాలా లేక ఎన్టీఆర్ తో సినిమా చేయాలా అన్న ఆలోచనలో పడ్డాట్ట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ కి అతనొక్కడే చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఒక్క హిట్టూ రాలేదు. రీసెంట్ గా వచ్చిన కత్తి చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది
అయితే ఎన్టీఆర్ మాత్రం తను ఇప్పుడు మల్టి స్టారర్ చిత్రాలు చేసే ఆలోచన లేదని, సోలో హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేసుకుంటే డేట్స్ కేటాయించగలనని చెప్పాడట. దాంతో తనే హీరోగా సినిమా చేయాలా లేక ఎన్టీఆర్ తో సినిమా చేయాలా అన్న ఆలోచనలో పడ్డాట్ట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ కి అతనొక్కడే చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఒక్క హిట్టూ రాలేదు. రీసెంట్ గా వచ్చిన కత్తి చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది
Subscribe to:
Comments (Atom)




